Friday, February 8, 2019

ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) ఫుల్ మూవీ రివ్యూ



టైటిల్    : ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్    : కామెడీ ఎంటర్‌టైనర్‌
న‌టీన‌టులు : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి
సంగీతం       : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం   : అనిల్‌ రావిపూడి
నిర్మాత     : దిల్‌ రాజు
యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ F2లో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య రిలీజ్‌ అయ్యింది. ఇప్పటి వరకు రిలీజ్‌ అయిన సినిమాలకు డివైడ్‌ టాక్‌ రావటంతో ఎఫ్‌ 2 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్‌గ కామెడీ రోల్‌లో కనిపించటం, వరుణ్‌ తేజ్‌ తొలిసారిగా మల్టీస్టారర్‌ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్‌ 2 అందుకుందా లేదా?

కథ‌
ఎమ్మెల్యే పి.ఏ గా ఉండే వెంకీ(వెంక‌టేష్‌)కు హారిక‌(త‌మ‌న్నా)తో పెద్ద‌లు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేస్తారు. అలాగే వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌)కు హారిక చెల్లెలు హ‌నీ(మెహ‌రీన్‌)తో నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి త‌ర్వాత తమన్నా, ఆమె త‌ల్లి మెహ‌రీన్‌ చేసే ప‌నుల వ‌ల్ల వెంకీకి ఫ్ర‌స్టేష‌న్ పెరిగిపోతుOది. వ‌రుణ్‌ను క‌లిసిన త‌ర్వాత వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని చెబుతాడు. కానీ వెంకీ మాట‌ల‌ను వ‌రుణ్ ప‌ట్టించుకోడు. ఇంటి ప‌క్క‌నుండే వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) స‌ల‌హాతో ముగ్గురు క‌లిసి యూర‌ప్ కు  వెళ‌తారు. విష‌యం తెలుసుకున్న తమన్నా, మెహ‌రీన్‌ కూడా యూరప్‌కి బ‌య‌లుదేరుతారు. అంద‌రూ ప్ర‌కాష్ రాజ్ ఇంట్లో చేరుతారు. అక్క‌డ నుండి తమాషాగా సినిమా సాగిపోతుంది. అస‌లు అంద‌రూ ప్ర‌కాశ్ రాజ్ ఇంటికి ఎందుకు వెళ‌తారు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అనుబంధాన్ని వారు గుర్తించారా? వాళ్ళు ఎందుకు ప్ర‌కాశ్ రాజ్ ఇంటికి వెళుతారు అన్నవిష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స‌మీక్ష
బారి విజయాలు సాధిస్తున్న అనిల్‌ రావిపూడి ఈ పండుగకి  ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కామెడీ సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించారు. ప్రతీ ఇంట్లో జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్‌ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి బాగా చేసారు. అనిల్ రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్‌ రైడ్‌లా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంలో కాస్త నెమ్మదించాడు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్‌ ఆలోచింప చేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్‌ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఎడిటింగ్‌,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్ల‌స్ పాయింట్స్‌
  • సినిమా మొత్తం కామెడీ ప్ర‌ధానంగా తెర‌కెక్కించారు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ అంత కామెడీతో ఉంటుంది. సెకండాఫ్ కామెడీతో ర‌న్ అవుతుంది కానీ ఫ‌స్టాఫ్ మీద కామెడి కొద్దీగ త‌గ్గింది.
  • వెంక‌టేష్ కామెడీ టైమింగ్‌తో బాగా ఆక‌ట్టుకున్నాడు. వ‌రుణ్ కూడా తొలిసారి చేసిన కామెడీ ట‌చ్ ప్ర‌య‌త్నం పర్వాలేదు అనిపించింది.
  • కెమెరా వ‌ర్క్‌ బాగుంది.
మైన‌స్ పాయింట్స్‌
  • కొత్త‌గా చెప్పుకోదగిన  క‌థేం కాదు. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ దాని నుండి హీరోలు ఏం చేశార‌నదే  సినిమా.
  • సెకండాఫ్ కాస్త డల్ గ ఉంటుంది.



Share:

Popular Posts

Recent Posts

Nam cu odio vocibus, cu eam graece iisque. Ius ceteros antiopam cu, per cibo illud verear an

Unordered List

Text Widget

Pages

Blog Archive

Post Top Ad

LightBlog

Search This Blog

Post Top Ad

Your Ad Spot

Food

3/Food/feat-list

Post Top Ad

Your Ad Spot

Music

2/Music/grid-big

Nature

3/Nature/grid-small

Fashion

3/Fashion/grid-small

Technology

Sports

3/Sports/small-col-right

Fashion

3/Fashion/big-col-right

Business

3/Business/big-col-left

Header Ads

Header ADS

Sponsor

AD BANNER

Extra Ads

AD BANNER

Contact Us

Name

Email *

Message *

Labels

Label Cloud

Instagram

Sports

3/Sports/col-left

Gallery

sidebar ads

Technology

3/Technology/col-right

Recent Posts

3/recent/post-list

Featured

Ultra Telugu

Popular Posts

Categories

Text Widget

Photo Profile
Taylor Wong Architecture Designer

The Japanese call it Hanakotoba, and King Charles II brought it to Sweden from Persia in the 17th century. Read More

Copyright © Ultra Telugu | Powered by Blogger Design by PWT | Blogger Theme by NewBloggerThemes.com